ఆదివారం, మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త గుండా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని, పార్టీకి చెందిన తోటి జనసైనికులు ఆయనను పరామర్శించి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్, మురళి, చక్రపాణి, దుర్గ ప్రసాద్, కామిని ప్రసాద్, డమాల చంద్రుడు, మరియు బీజేపీ మండలాధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.