డిండి జలాశయం ఉధృతితో ఉప్పునుంతల మండలం లత్తిపురం వద్ద రహదారి కోతకు గురైంది. భారీ నీటి ప్రవాహంతో రహదారి దెబ్బతినడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై వాహనాల మల్లింపు చేపట్టారు.