ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సెల్యూట్ చేసిన నారా లోకేష్.. వీడియో

AP: మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్‌ను నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం స్పందించిన తీరుకు హాట్సాఫ్. చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలకు ఆయన చెప్పులు కొనిచ్చారు. థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి, ఎంతో గొప్పది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం’ అని ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్