సంగం మండలం, దువ్వూరు గ్రామంలో బుధవారం వెంకటసుబ్బయ్య, కమల ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంటి పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, గ్యాస్ పైపు లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.