కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసుల త్యాగాలే కారణమని అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కందుకూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని, రక్తదానం చేసిన యువతను అభినందించారు.