కందుకూరులో తనపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని యూట్యూబర్ M. శ్రీనివాసరావు తప్పుబట్టారు. దారకానిపాడు ఘటనలో ఎమ్మెల్యే తప్పిదాన్ని ప్రశ్నించడం, తుఫాను సమయంలో ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపడం నేరమా అని ఆయన బుధవారం ప్రశ్నించారు. పోలీసుల తీరును విమర్శిస్తూ, ఇలాంటి తప్పుడు కేసులతో న్యాయస్థానాల్లో చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.