కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అటుగా వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న కొందరు వ్యక్తులు వారిని విడదీసి పంపించారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువకులు నడిరోడ్డుపై కొట్టుకోవడం విమర్శలకు దారితీసింది.