కావలిలో రోజువారీ పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులను ఆప్కాస్లో చేర్చుకోవాలని, వారికి కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీగా పోరాటం చేస్తామని సీఐటీయూ నేత పెంచలయ్య హెచ్చరించారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కు వినతిపత్రం అందజేశారు.