రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 9.30 గంటలకు కావలి నియోజకవర్గం దగదర్తికి చేరుకుంటారు. అక్కడ ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు.