కోవూరు పట్టణం లక్ష్మీనారాయణపురం వద్ద ఎండు చేపల గోదాము సమీపంలో వేగూరు కాలువలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో చేరుకొని పంచనామా నిర్వహించారు. వరదల నేపథ్యంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చి ఉంటుందని, మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని, సుమారు 35 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.