ఈ నెల 17న నెల్లూరుకు మాజీ సీఎం జగన్ రాక..?

వైసీపీ అధినేత జగన్ త్వరలో నెల్లూరు పర్యటనకు రావనున్నట్టు సమాచారం. ఇటీవల దాడికి గురైన పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన వస్తారని చెబుతున్నారు. ప్రసన్నకు ధైర్యం చెప్పేందుకు జగన్ ఇప్పటికే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే నెల్లూరు జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా కలుస్తారు అని వినికిడి. ఈనెల 17 లేదా వేరే తేదీ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

సంబంధిత పోస్ట్