కొడవలూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం టపాతోపు టర్నింగ్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు బైకుపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో భార్య రవణమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు. సుబ్రహ్మణ్యంను అపోలో ఆసుపత్రికి తరలించారు, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్