కోవూరు ఆర్టీసీ సమీపంలో ముళ్లపొదల్లో లభ్యమైన పసికందును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రి తరలించారు. కోవూరు ICDS CDPO శారద చిన్నారిని పరిశీలించి, నెల్లూరు GGHలోని న్యూ బోర్న్ బేబి కేర్ యూనిట్కు తరలించారు. పరీక్షల అనంతరం శిశు గృహానికి తరలించనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.