ఈ నెల 6, 7, 8 తేదీల్లో నగరంలోని విఆర్సీ మైదానంలో జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు కోరారు. మంగళవారం విఆర్సీ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన వారు, ఇప్పటివరకు 80-85 శాతం పనులు పూర్తయ్యాయని, చివరిదశ పనులు మాత్రమే మిగిలాయని తెలిపారు. యాగశాల, మెయిన్ స్టేజీ, నమూనా ఆలయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు.