శనివారం, దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద పిల్లాపేరు వంతెనను ఒక బొలెరో వాహనం ఢీకొట్టింది. విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదంపై ఆరా తీశారు.