నెల్లూరు చిన్న బజార్ పోలీసులు సోమవారం చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న శ్రీనాథ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై బాలాజీ నగర్, నవాబుపేట, బుచ్చిరెడ్డిపాలెం, దర్గామిట్ట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని సీఐ చట్టం కోటేశ్వరరావు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5,15,000 విలువైన 48 గ్రాముల బంగారం, 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.