జిల్లాలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్స్, ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లో గర్భస్త పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పిసి పిఎన్‌డిటి), సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం (ఏ ఆర్ టి) అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. గర్భస్త శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ నొక్కిచెప్పారు.