రెండేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడు అమ్మ అంటూ పిలవడంతో ఒక తల్లి ఆనందంతో నిండిపోయింది. నెల్లూరు అంబేద్కర్ భవన్‌లో ఆదివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్టల్లోని పిల్లలతో పాటు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చిన వారు పాల్గొన్నారు. హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థి తన తల్లి శేషమ్మను గుర్తుపట్టి ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో ఆమె కన్నీటిమయమైంది. రెండేళ్ల క్రితం తన బిడ్డ చెన్నైలో తప్పిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.