నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కమిషనర్ వై. ఓ నందన్ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా అన్ని డివిజన్లలో డ్రైన్ కాలువల నిర్మాణం, మరమ్మత్తు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.