నెల్లూరు: దేవాలయాల వద్ద పటిష్ట భద్రత చర్యలు*

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలోని ప్రముఖ శివాలయాలు, దేవాలయాలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల మంగళవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ, ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ఆలయాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్