నెల్లూరు కమిషనర్ ను సన్మానించిన అధికారులు

మొంథా తుఫాను సహాయక చర్యల్లో ప్రతిభ కనబరిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కమిషనర్ వై. ఓ నందన్ కు ప్రతిభా పురస్కారం లభించింది. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తుఫాను సమయంలో నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్