నెల్లూరు టౌన్‌లోని జగదీశ్ నగర్ ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య, తమ ప్రాంతంలో విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు అడ్డు వస్తున్నాయని నవంబర్ 3న "డయల్ యువర్ సీఎండీ" కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఏపీ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ యల్. శివ శంకర్, విద్యుత్ శాఖ సిబ్బందికి కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. రామచంద్రయ్య "డయల్ యువర్ సీఎండీ" కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు.