నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్, ముత్తుకూరు రోడ్డు డివైడర్లను అందంగా తీర్చిదిద్దేందుకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అరుదైన మొక్కలను నాటుతోంది. బుధవారం నాటికి వివిధ రకాలైన, ఆకృతులలో ఉన్న మాల్ఫిజియన్ జాతి మొక్కలను ఆరు అడుగుల ఎత్తులో కోన్స్ రూపంలో తెప్పించి, ప్రస్తుతం ఉన్న చెట్ల మధ్యలో నాటారు. ఈ చర్యలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి, రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా గమనిస్తున్నారు.