నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ లో లెర్నింగ్ డిజెబిలిటీ అవేర్నెస్ మంత్ సందర్భంగా, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు లెర్నింగ్ డిజెబిలిటీపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పాస్టిక్స్ సెంటర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సరైన సమయంలో గుర్తించి, ప్రత్యేక విద్య, థెరపీ అందించడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని తెలిపారు.