మనుబోలు: విద్యార్థులకు స్కిల్ కాంపిటీషన్: విజేతలకు బహుమతులు

మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో సోమవారం ఒకేషనల్ విద్యార్థులకు స్కిల్ కాంపిటేషన్లు నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాన్ని పలు మోడల్స్ ద్వారా ప్రదర్శించారు. బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగంలో పదో తరగతి విద్యార్థిని లాస్య శ్రీ హర్షిత మొదటి బహుమతి గెలుచుకున్నారు. షేక్ ఫోజియా, ప్రియ వర్షిని, దేవిప్రియలు తొమ్మిదో తరగతిలో ద్వితీయ బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్