జులై 13వ తేదీ లోగా అన్నదాత సుఖీభవసకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య కోరారు. బుధవారం మనుబోలు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 5,957 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకంకు అర్హులుగా గుర్తించామన్నారు. వీరి ఖాతాలో మూడు విడతలగా రూ. 20వేల నగదు జమ అవుతుందన్నారు.