పొదలకూరు మండలంలోని మోంథా తుఫాన్ బాధితులకు గురువారం తాసిల్దార్ శివకృష్ణయ్య నిత్యవసరాలు అందజేశారు. తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న మండలంలోని 111 మంది బాధితులకు ఈ సహాయం అందిస్తున్నారు. నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి, సురాయిపాలెం, విరువూరు, మహమ్మదాపురం, పొదలకూరు, ముదిగేడు గ్రామాల్లోని బాధితులకు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు.