ఎమ్మెల్యేను కలిసిన కొండాపురం నూతన ఎస్ఐ

కొండాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన జె. మాల్యాద్రి ఆదివారం వింజమూరు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాపురం మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దామ మహేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్