సీతారామపురం నుంచి గంధంవారిపల్లి వైపుగా వెళ్లే 167 B హైవే రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. దీనితో అటుగా వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్తంభం దారుణ స్థితిలో ఉందని, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సరిచేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.