శుక్రవారం, పోరుమామిళ్ల నుంచి సీతారామపురం వైపుగా వస్తున్న ఒక భారీ ట్రక్, సీతారాంపురం ఘాట్ రోడ్డు మలుపు వద్ద బోల్తా పడింది. జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం ఇనుము సామగ్రిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైవే నిర్వాహకులు తొలగింపు చర్యలు చేపట్టారు.