ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సిహెచ్ ధరణి, ఎన్ గురు విగ్నేష్, జి సంజనలు నియోజకవర్గ స్థాయిలో ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు విద్యార్థులలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించబడ్డాయి.