ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగవంతం అయింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఇది ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందట. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని సబ్ కమిటీ భావిస్తుందట.