AP: కొత్త జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. దీనివల్ల ఖర్చులు తగ్గడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను శక్తిమంతం చేసి, వ్యవస్థలు బలోపేతం అవుతాయన్నారు. వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గనుందన్నారు.