మొంథా తుఫాన్ నష్టపరిహారం చెల్లించలేదు: కాకాణి

AP: కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, దళారీల బారిన పడి రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. మొంథా తుఫాన్ నష్టపరిహారం నేటికి చెల్లించలేదన్నారు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్