ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం.. రూ.లక్ష వరకు రుణం

AP: డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు అండగా ప్రభుత్వం ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’ పథకాన్ని అమలు చేయనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు ప్రభుత్వం సాయం చేయనుంది. 4 శాతం వడ్డీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణసాయం అందిస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. అడ్మిషన్ లెటర్, ఇనిస్టిట్యూషన్ వివరాలు, రసీదు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

సంబంధిత పోస్ట్