జగ్గయ్యపేట మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర అన్నారు. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా గాజు గ్లాసుల్లో నీరు అందించాలని హోటళ్లు, కర్రీ పాయింట్లలో పలుచటి కవర్లు వాడాలని సూచించారు.