ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, ఎగువ ప్రాంతాల ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఆయన, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు, సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.