పరిటాలలో అక్రమ మద్యం పట్టివేత

కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు మద్యం బాటిళ్లను కంచికచర్ల ఎక్సైజ్ సీఐ ఆశ్రపునీషా బేగం, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శనివారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం, మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తప్పవని సీఐ పునీషా బేగం హెచ్చరించారు. ఈ సంఘటనతో అక్రమ మద్యం వ్యాపారుల్లో భయం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్