కంచికచర్ల మండల పరిధిలోని కృష్ణా నది ప్రవాహ సంబంధిత అధికారులకు, పరిసర గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కంచికచర్ల తహశీల్దార్ నరసింహారావు సూచించారు. ఆదివారం అవసరమైన ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత గ్రామ రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు సూచించారు.