పెనుగొలనులో దసరా ఉత్సవాలు: లలితాదేవి పారాయణం, భజనతో ఆధ్యాత్మిక శోభ

గంపలగూడెం మండలం పెనుగొలనులోని శిరిడి సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి శ్రీ లలితాదేవి పారాయణం, సాయిబాబా చాలీసా, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు 108 దీపాలతో దీపోత్సవ పూజ చేశారు. ఆదివారం సాయిబాబాకు కావిడీసేవ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలు తిరువూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.

సంబంధిత పోస్ట్