విజయవాడలోని పోరంకిలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా చేర్చి, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై లాభాలు వస్తాయని నమ్మించి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని మోసం చేశారు. బాధితుడు పలు దఫాలుగా ఆన్లైన్ ద్వారా రూ. 64.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటరమణ తెలిపారు.