ర్యాపిడో భాగస్వామ్యంతో వెయ్యి మందికి పైగా మహిళా రైడర్లకు ఉపాధి కలిగిందని ఇటీవలే మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వంటింటికే పరిమితం అనే ముద్రను చెరిపేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం దేశానికి గర్వకారణం. ఇలా ఎంతోమంది మహిళలు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈవీ వాహనాలు కొనుగోలు చేసేందుకు మహిళలకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు.