AP: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటివి ఈ SPV పరిధిలోకి వస్తాయి. మరోవైపు, గతంలో భూ సమీకరణలో ఇవ్వని భూమిని తీసుకోవాలని భూసేకరణకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.