విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం. ఇది ప్రజా ఉద్యమంగా మారితేనే ప్రైవేటీకరణ ఆగుతుంది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడమే సీఎం చంద్రబాబు నైజం’ అని బొత్స విమర్శించారు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేయగా.. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.