AP: కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకు అరాచకాలు అధికమయ్యాయని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మా ఇంటిపై దాడి చేయడ కాకుండా మాపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, ఇంతకు ఇంతా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం కొవూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రసన్నకుమార్‌ను కలిశారు.