AP: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో తమకు ప్రాణహాని ఉందని ఏలూరు(D) పెదవేగి(M) పినకడిమి గ్రామ సర్పంచ్ సునీత భర్త శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకునేందుకు ఎమ్మెల్యే చింతమనేని కుట్ర పన్నుతున్నారని చెప్పారు. శనివారం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమపై దాడి చేశారన్నారు.