సినీ నటుడు అజయ్ ఘోష్ మంగళవారం చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా మనుషులు ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. సినిమా రంగంలో తనకు లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో విభిన్న పాత్రల్లో నటిస్తానని తెలిపారు.