కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో జీఎస్టీ తగ్గింపు పోస్టర్లను పంపిణీ చేశారు. టెక్స్టైల్స్పై జీఎస్టీని 12 శాతం నుంచి 5శాతం కి, 28 శాతం ఉన్న వస్తువులపై పన్నును 12 శాతం కి తగ్గించారని తెలిపారు. దేశంలో జీఎస్టీ పండగ వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు.