పల్నాడు: ప్రాణం తీసిన గొడుగు

చిలకలూరిపేట మండలం, గణపవరం రాజీవ్ంధీ కాలనీకి చెందిన దంపతులు చక్రవరం సాంబశివరాజు, రమాదేవి (44) ఈ నెల 28న స్పిన్నింగ్ మిల్లులో కూలి పనులు చేసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా, బలంగా వీచిన గాలితో రమాదేవి పట్టుకున్న గొడుగు వెనక్కి పడింది. దానిని అందుకునే ప్రయత్నంలో ఆమె కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు నాదెండ్ల ఎస్సై పుల్లారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్