దాచేపల్లి: పొంగిన కృష్ణ, మూసీ నదీ.. ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు

కృష్ణ, మూసీ నదులలో వరద ఉధృతి పెరగడంతో, దాచేపల్లి మండలం రామాపురం మత్స్యకారుల కాలనీలో అర్ధరాత్రి అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు. నాగార్జునసాగర్ నుండి అధిక వరద వస్తుందని, మూసి నది కూడా పొంగి పొర్లుతోందని దాచేపల్లి డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్